Pelli Kani Prasad : కమెడియన్ నుంచి నటుడిగా మారిన సప్తగిరి మరోసారి అలరించేందుకు వచ్చాడు. ప్రస్తుతం పెళ్లికాని ప్రసాద్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా వినోదాన్ని పంచేలా ఉంటుందని తెలిపారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన పోస్టర్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
Pelli Kani Prasad Movie Updates
పెళ్లి కాని ప్రసాద్(Pelli Kani Prasad) చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని విజన్ గ్రూప్ , థామ్ మీడియా ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. చాగంటి సినమాటిక్ వరల్డ్ సమర్పించింది. ఇదిలా ఉండగా పెళ్లి కాని ప్రసాద్ చిత్రాన్ని ప్రసిద్ద చలన చిత్ర నిర్మాత దిల్ రాజు సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేయనుండడం విశేషం. దీంతో చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా చేసింది.
ఇటీవలే దిల్ రాజు సంక్రాంతి పండుగ సందర్బంగా కొత్త ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేశారు. ఒకటి మెగా ఫ్యామిలీకి చెందిన గ్లోబల్ స్టార్ నటించిన ఏమ్ ఛేంజర్ కాగా మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం. చెర్రీ మూవీ ఢమాల్ కాగా వెంకీ మూవీ అదరగొట్టింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
కంటెంట్ బాగుంటేనే సినిమాను రిలీజ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు దిల్ రాజు. మరి పెళ్లికాని ప్రసాద్ ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి. సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ నటించగా , మురళీధర్ గౌడ్, లక్ష్మన్, అన్నపూర్ణ ఇతర పాత్రలలో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read : Beauty Vaani Kapoor :వాణి కపూర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్