క్రియేటివిటీకి పెట్టింది పేరు కొత్త దర్శకులు. తాజాగా రిలీజ్ అయిన సినిమాలలో కన్నడ డబ్బింగ్ తో తెరకెక్కింది సప్త సాగరాలు దాటి చిత్రం. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ప్రస్తుతం తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.
ఈ మూవీలో కన్నడ కథానాయకి రుక్మిణి వసంత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆమె నటనకు జనం ఫిదా అవుతున్నారు. బెంగళూరు స్వస్థలం ఆమెది. ఆమె లండన్ లో నటనలో కోర్సు చేసింది. రుక్మిణి వసంత్ కు చిన్నప్పటి నుంచే నటన అంటే ఆసక్తి. ఇటీవలే ఆమెకు ఈ సినిమా అస్సెట్ గా మారింది.
ప్రధానంగా ఆమెలో ఉన్న ఆసక్తికి అద్భుతమైన నటనను జోడించే ప్రయత్నం చేశారు దర్శకుడు.
ఇదిలా ఉండగా ఆమె 2019లో బీర్బల్ చిత్రంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఆమెకు ఆశించిన దానికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చేలా చేసింది. అంతకు ముందు భగీర సినిమాలో కూడా చేసింది. తన నటనతో మెస్మరైజ్ చేసింది.
ఈ చిత్రంలో అనేక రకాలుగా భావోద్వేగాలను ప్రతిఫలించేలా చేసింది. ప్రస్తుతం కన్నడ పరిశ్రమ నుంచి టాప్ లో కొనసాగుతున్నారు. ఇద్దరు నటీమణులు వారిలో ఒకరు శ్రీలీల మరొకరు రష్మిక మందన్నా. వీరి జాబితాలో చేరారు రుక్మిణి వసంత్.