సినిమా రంగంలో పని చేస్తున్నవారికి నమ్మకాలు ఎక్కువ. తేదీలు, ముహూర్తాలు, పూజలు, విడుదల రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది స్వాములు, జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఇక పండుగలు వస్తున్నాయంటే చాలు సినిమాలు పలకరిస్తుంటాయి.
చాలా మటుకు కొత్త సినిమాలన్నీ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అందులో మొదటి వరుసలోకి వచ్చే నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అతడు దిల్ రాజు మాత్రమే.
ఆయనకు విపరీతమైన సెంటిమెంట్. గతంలో తను నిర్మించిన సినిమాలన్నీ ఈ ఫెస్టివల్ ను ఆధారంగా చేసుకుని విడుదల చేసినవే ఉన్నాయి. తాజాగా మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో గీత గోవిందమ్ తీసిన పరుశురామ్ దర్శకత్వంలో తాజాగా రౌడీ హీరోగా పేరు పొందిన విజయ్ దేవరకొండ తో చిత్రం తీస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక టాలీవుడ్ కు సంబంధించి చూస్తే ఈసారి సంక్రాంతికి అర డజనుకు పైగా చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో సినీ ప్రియులకు పండగేనని చెప్పక తప్పదు.గతంలో ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, వారసుడు, శతమానం భవతి సినిమాలు పండక్కే తీసుకు వచ్చాడు.
ఈ సారి వారసుడు రిలీజ్ చేశాడు. మంచి టాక్ వచ్చింది. ఇందులో విజయ్ నటించాడు. మరో వైపు సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ , ఈగల్ , నా సామి రంగా రానున్నాయి. మరి ఎవరి సినిమాలు ఆడతాయో చూడాల్సి ఉంది.