Sankranthiki Vasthunnam : మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎవరూ ఊహించని రీతిలో దుమ్ము రేపింది. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
Sankranthiki Vasthunnam OTT Updates
పండుగ సందర్బంగా మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కాగా అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక బాబ్జీ దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రూ. 125 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ సక్సెస్ గా నిలిచింది.
దీంతో దిల్ రాజుకు ఓ సినిమా ప్లాప్ కాగా మరో సినిమా సూపర్ హిట్ కొట్టింది. దీంతో మనోడు బతికి బయట పడ్డాడు. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) చిత్రం కోసం పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి ఓటీటీ సంస్థలు. చివరకు జీ గ్రూప్ నకు చెందిన జీ తెలుగు, జీ 5 స్వంతం చేసుకుంది. తొలుత బుల్లి తెరలో ప్రసారం కాగా, జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.
ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం అత్యధికంగా ఆదరణ చూరగొంది. అంతే కాకుండా పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ ను సాధించింది. నిన్నటి నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ నిమిషాల వీక్షకులను దాటింది. ఇప్పటికే 1.3 మిలియన్లకు పైగా వీక్షించడం విశేషం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ , ఐశ్వర్య రాజేశ్ , మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించారు. బుల్లి రాజు పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేశాడు.
Also Read : Anurag Kashyap- Sensational Role :పోలీస్ ఆఫీసర్ గా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్