Sanjay Gupta : విక్రాంత్ మాస్సే కొంతకాలం నటనకు విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘12thఫెయిల్’తో అందరినీ ఆకర్షించిన విక్రాంత్ మాస్సే(Vikrant Massey) కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయబోనంటూ విరామం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు తన పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్ వచ్చిందని ఆయన అన్నారు. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదన్నారు. మళ్లీ సరైన సమయం వచ్చేంత వరకు.. 2025లో విడుదల కానున్న సినిమానే తన చివరి చిత్రమని వెల్లడించారు. ప్రస్తుతం అతని నిర్ణయం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఇదేం నిర్ణయం అని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా(Sanjay Gupta) స్పందించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలన్నారు. గతంలో ఇలా విరామం ప్రకటించిన కొందరు నటులు, దర్శకులు తిరిగి కెరీర్‌ను ప్రారంభించి విజయాలు అందుకున్నారు అని గుర్తు చేశారు గుప్తా.
Sanjay Gupta Comments
‘సినిమా పరిశ్రమలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ఆలోచించాలి. ధైౖర్యం కావాలి. 2008లో దర్శకుడు హన్సల్ మెహతా విరామం తీసుకున్నారు. ముంబయిని విడిచిపెట్టారు. కుటుంబంతో సహా ఒక చిన్న గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత 2012లో ‘షాహిద్’ చిత్రంతో గొప్ప కమ్‌బ్యాక్ ఇచ్చారు. అది తన కెరీర్‌లో అత్యుత్తమంగా చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. వారి ప్రతిభపై వారికి నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విధంగా విక్రాంత్ ఇప్పుడు ఇదే బాటలో వెళ్తున్నాడు. పోటీ, అభద్రత, అసూయతో నిండిన సమయం నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. తండ్రిగా, భర్తగా, కుమారుడిగా ఆయన తనకున్న బాధ్యతలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. అందుకే అతడిని ఎవరూ విమర్శించకండి’’ అని పోస్ట్ పెట్టారు.
Also Read : Pushpa 3 : అల్లు అర్జున్ ‘పుష్ప 3’ పై ఓ సంచలన అప్డేట్