ధూమ్ సిరీస్ దర్శకుడు మృతి
Sanjay Gadhvi : బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ గాధ్వీ (56) గుండెపోటుతో మరణించారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన సంజయ్ గాధ్వీను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే సంజయ్ అప్పటికే మరణించనట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ధూమ్, ధూమ్-2 వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ హాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.
సంజయ్ గాధ్వీ(Sanjay Gadhvi) మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. మరో మూడు రోజుల్లో తన 57వ పుట్టిన రోజును జరుపుకోనున్న సంజయ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా సంతాపం తెలుపుతున్నారు. సంజయ్ గాధ్వీ కుమార్తె సంజినీ తెలిపిన వివరాల ప్రకారం… అతను ఆరోగ్యంగానే ఉన్నారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా 9:30 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. సంజయ్ ఆకస్మిక మరణానికి గుండెపోటు కారణమై ఉంటుందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
Sanjay Gadhvi – సంజయ్ సినిమా కెరీర్
మహారాష్ట్ర లోని ముంబైకు చెందిన సంజయ్ గాధ్వీ 2000 లో మొదటి సినిమా తేరే లియే తో దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సంజయ్…. ఆ తరువాత కిడ్నాప్, మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2, వంటి యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. 2004లో ధూమ్ సినిమాకు దర్శకత్వం వహించగా… రెండేళ్ళ వ్యవధిలోనే దానికి సీక్వెల్ గా ధూమ్ -2 సినిమా నిర్మించారు. ఈ ధూమ్ సిక్వెల్స్ తో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. చివరిగా 2020లో ఆయన ఆపరేషన్ పరిందే అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
Also Read : Kangana Ranaut: కంగనాను సర్ ప్రైజ్ చేసిన తలైవా