Sanjay Dutt: ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt).. బిగ్ బుల్ పాత్రలో విలన్ గా నటిస్తుండగా… రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… ఆగస్టు 15న విడుదల కు సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఈ సినిమా నుంచి ‘బిగ్ బుల్’ సాంగ్ ని ముంబైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
Sanjay Dutt…
ఇప్పటికే విడుదలైన కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ‘బిగ్ బుల్’ అనే స్పెషల్ సాంగ్ ను లాంచ్ చేశారు మేకర్స్. పూరి జగన్నాధ్ తన విలన్ లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో ప్రెజెంట్ చేయడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు. ఇందులో ‘బిగ్ బుల్(Big Bull)’ క్యారెక్టర్‌ని సంజయ్ దత్ పోషించారు. స్వరబ్రహ్మ మణి శర్మ కంపోజ్ చేసిన ఈ ‘బిగ్ బుల్’ సాంగ్ విజువల్ గా, మ్యూజికల్‌గా పవర్ ఫుల్‌గా ఉంది. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ అయిన ఈ పాటలో కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేయగా… ఈ పాటలో సినిమాలోని కీలక పాత్రలన్నీ కనిపించడం విశేషం. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చంద్ర, సంజన కల్మంజే ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.
ముంబైలో బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) మాట్లాడుతూ… తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసి, బిగ్ బుల్‌గా ప్రజెంట్ చేస్తున్న పూరికి థాంక్ యూ. ఛార్మి పరేషాన్ చేసింది.. తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రొడక్ట్ ఇంత అద్భుతంగా వచ్చింది. కావ్య ఇందులో చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది. రామ్ నా యంగర్ బ్రదర్ లాంటివాడు. తనతో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’గా మస్త్ ఉంటాడు. తనతో వర్క్ చేయడం ప్లెజర్ అండ్ హానర్. తను గుడ్ పెర్ఫార్మర్. వెరీ హార్డ్ వర్కర్. తన ఫన్ తో ఈ సినిమా చేశాం. చాలా చోట్ల తిరిగాం. చాలా మస్తీ చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
‘డబుల్ ఇస్మార్ట్’ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : Toxic: యశ్ ‘టాక్సిక్’ షూటింగ్ షురూ !