Sanjay Dutt: టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో రానున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ‘పుష్ప ది రూల్’ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప ది రైజ్’ కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’… బన్నీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి ఇండియా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తొలిసారి ఓ టాలీవుడ్ హీరో… అందులోనూ అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించింది. దీనితో ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనితో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించడంతో… అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్… ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Sanjay Dutt Movie Updates
పాన్ ఇండియాలో మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన ‘పుష్ప ది రూల్’ లో… బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt)… ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఓ సాధారణ ఎర్ర చందనం కూలీ… స్మగ్లర్ గా మారిన అంశాన్ని ఎంతో ఆవక్తికరంగా… హీరో ఎలివేషన్ తో ‘పుష్ప ది రైజ్’ లో చూపించిన దర్శకుడు సుకుమార్… ఇప్పుడు ఆ ఎర్ర చందనం స్మగ్లర్… అంతర్జాతీయ డాన్ గా అవతరించాడు అనేదానిని ‘పుష్ప ది రూల్’ చూపించబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ కోసం ఓ డాన్ పాత్ర ను సుకుమార్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్-2లో మంచి పాత్రలో కనిపించిన సంజయ్ దత్(Sanjay Dutt)… త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కబోతున్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా నటిస్తున్నారు. దీనితో ‘పుష్ప ది రూల్’ లో కూడా సంజయ్ దత్ నటించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ… అ వార్త నిజం అయితే బాగుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సునీల్, పాహద్ ఫజిల్, అనసూయ కీలక పాత్రలు పోషించిన ‘పుష్ప ది రైజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో… దక్షిణాది అగ్రతార సమంత… ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
Also Read : Hero Suriya: అభిమానులకు సూర్య ప్రత్యేక బంతి భోజనం !