Saniya Iyappan: మేగజైన్ ఫోటో షూట్ చేసిన మలయాళ బ్యూటీను ట్రాన్స్‌ జెండర్‌ లా ఉందంటూ ట్రోల్స్‌ !

మేగజైన్ ఫోటో షూట్ చేసిన మలయాళ బ్యూటీను ట్రాన్స్‌ జెండర్‌ లా ఉందంటూ ట్రోల్స్‌ !

Hello Telugu - Saniya Iyappan

Saniya Iyappan: సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించే సెలబ్రిటీలు అరుదుగా కనిపిస్తారు. దీనికి కారణం ఆఫర్లు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. దీనితో దాదాపు అందరు సినీతారలు మోడ్రన్‌, గ్లామర్‌ గా కనిపించడానికే ఓటేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, అవార్డుల మహోత్సవం, మేగజైన్ కవర్ పేజీలకోసం అయితే ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత గుర్తింపు. ఇదే విషయాన్ని బలంగా నమ్మిన మలయాళ బ్యూటీ సానియా ఇయప్పన్‌(Saniya Iyappan) కూడా… కొన్నిసార్లు చీర కడుతూనే ఎక్కువ సార్లు మోడ్రన్‌ దుస్తుల్లో కనువిందు చేస్తోంది.

Saniya Iyappan…

అయితే ఈ మధ్యే ఓ మాగజైన్‌ కోసం ఫోటోషూట్‌ చేసిన సానియా ఇయప్పన్‌ కు నెటిజన్లు నుండి విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కుంటుంది. ఈ ఫోటో షూట్ నుండి రిలీజైన ఫోటోలు చూసి కొందరు నటి సర్జరీ చేయించుకుందని విమర్శిస్తున్నారు.మరికొందరు మాత్రం తన ముఖమేంటి మగవాడిలా కనిపిస్తోంది ? సడన్‌ గా చూసి ట్రాన్స్‌జెండర్‌ అనుకున్నాను. ఆమెకు ఆ హెయిర్‌ స్టైల్‌ అస్సలు సెట్టవ్వలేదు. తన ముక్కు, పెదాలకు ఏదో సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది… దీనివల్ల ఆమె సహజ అందం కోల్పోయింది అని కామెంట్లు చేస్తున్నారు. దీనితో మేగజైన్ కవర్ పేజీ ఫోటో షూట్ ఏకంగా సానియా ఇయప్పన్‌(Saniya Iyappan) ను ట్రాన్స్ జెండర్ ను చేసిందని మాట.

ఇలా తనను ట్రోల్‌ చేయడం ఇది కొత్తేం కాదు. సానియా పొట్టి బట్టలు, కురచ దుస్తులు ధరించిన ప్రతిసారి నెటిజన్లు ఇలానే ట్రోల్‌ చేస్తుంటారు. అయితే ఈ నెగెటివ్‌ కామెంట్లను అస్సలు లెక్క చేయనని, తన జీవితం తన ఇష్టమని, తనకు నచ్చినట్లుగానే బతుకుతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

కాగా సానియా ఇయప్పన్‌… చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది. 2014లో వచ్చిన సూపర్‌ డ్యాన్సర్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. D ఫర్‌ డ్యాన్స్‌: రెండో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌ గా సరిపెట్టుకుంది. చిన్న వయసులో డ్యాన్స్‌ స్టెప్పులతో మైమరిపించిన సానియా మలయాళ క్వీన్‌ మూవీతో హీరోయిన్‌గా మారింది. లూసిఫర్‌, ప్రేతమ్‌ 2, కృష్ణకుట్టి పని తుడంగి, సెల్యూట్‌, సాటర్‌డే నైట్‌ వంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది.

Also Read : Bahishkarana OTT : ఓటీటీ లో హల్చల్ చేస్తున్న అంజలి బోల్డ్ థ్రిల్లర్ సిరీస్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com