Sandhya Theatre Tragedy : సంధ్య థియేటర్ ఘటనలో మరో సంచలన అప్డేట్

దీంతో ఈ విషయమై ప్రశ్నం. ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సర్వే నిర్వహించింది ఓ జాతీయ వార్తా సంస్థ...

Hello Telugu - Sandhya Theatre Tragedy

Sandhya Theatre : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్ట్‌ తెలుగురాష్ట్రాల్లోనే కాక…జాతీయస్థాయిలోనూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అల్లుఅర్జున్(Allu Arjun) అరెస్ట్‌‍‌ను కొందరు సమర్థిస్తే, మరికొందరు పోలీసులు కావాలనే చేశారంటూ తప్పుబడుతున్నారు. దీంతో ఈ విషయంపై సర్వే నిర్వహించింది ఓ ప్రముఖ వార్తాసంస్థ. అల్లుఅర్జున్(Allu Arjun) నిజంగానే తప్పుచేశాడా? లేకపోతే తెలంగాణ పోలీసులు కక్ష్యపూరిత ధోరణితో అరెస్టు చేశారా? అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రశ్నం. ఏఐతో కలిసి నిర్వహించిన ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఇంతకీ, ప్రముఖ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన రిపోర్ట్‌లో తేలిందేంటి? అల్లుఅరెస్ట్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ఆసక్తికర ఫలితాలే ఇవి.

Sandhya Theatre Tragedy..

‘పుష్ప’సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లుఅర్జున్ అరెస్ట్ కావడం ప్రస్తుతం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘పుష్ప-2(Pushpa 2)’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో మహిళ మృతి వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేయడంతో రాజకీయపరంగానూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయమై ప్రశ్నం. ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సర్వే నిర్వహించింది ఓ జాతీయ వార్తా సంస్థ. తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా? అనే ప్రశ్నకు 2,502 మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో 34 శాతం మంది అంటే 843 మంది ‘అవును’ అని సమాధానమివ్వగా.. దాదాపు అంతేస్థాయిలో 33 శాతం లేదా 841 మంది ‘కాదు’ అని బదులిచ్చారు. 14 శాతం మంది ‘ఏం చెప్పలేము’ అని వెల్లడించగా, మిగిలిన 19 శాతం మంది ‘సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు’ అని చెప్పారు.

‘పుష్ప2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు సినిమా యూనిట్ సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లడంతో అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. దీంతో సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను గత శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. అల్లు అర్జున్‌కు న్యాయమూర్తి 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అల్లు అర్జున్ అరెస్ట్‌పై బన్నీ ఫ్యాన్స్ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు చేయగా.. ప్రభుత్వం మాత్రం అరెస్ట్‌ను సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని వార్తా సంస్థలు అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సర్వేలు చేస్తున్నాయి.

Also Read : Actor Sudeep : బిగ్ బాస్ లో కొనసాగింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన కన్నడ స్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com