Sandeep Weds Chandini : నటి చాందినీ రావును పెళ్లాడిన కలర్ ఫోటో దర్శకుడు

కలర్‌ ఫొటో’తో దర్శకుడిగా పరిచయమయ్యారు...

Hello Telugu - Sandeep Weds Chandini

Sandeep : ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు సందీప్‌ రాజ్‌ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌ చాందినీరావును ఆయన వివాహం చేసుకున్నారు. తిరుమల వేదికగా శనివారం వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకకు హీరో సుహాస్‌, వైవా హర్ష తదితరులు హాజరై సందడి చేశారు. అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కలర్‌ ఫొటో’లో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు సందీప్‌రాజు షార్ట్‌ ఫిల్మ్‌లతో కెరీర్‌ ప్రారంభించారు.

Director Sandeep – Chandini Rao Marriage

కలర్‌ ఫొటో’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. సుహాస్‌ హీరోగా నటించిన ఆ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో సందీప్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. సందీప్‌ ప్రస్తుతం రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ హీరోగా ‘మోగ్లి’ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Also Read : Anasuya Bharadwaj : పుష్ప సినిమాపై వస్తున్న కామెంట్స్ కి ఘాటుగా స్పందించిన అనసూయ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com