Sandeep Vanga: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘యానిమల్’. దీపావళి కానుకగా గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి రణ్ బీర్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో ఈ సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులకు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ… ‘కబీర్‌సింగ్’, ‘యానిమల్’చిత్రాలు స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. అయితే కిరణ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం… ‘యానిమల్’ దర్శకుడు సందీప్ వంగా(Sandeep Vanga) కూడా వాటిని చూడటంతో… కిరణ్ రావు విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.
Sandeep Vanga Comment
ఈ సందర్భంగా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ వంగా మాట్లాడుతూ… “కిరణ్ రావు వ్యాఖ్యలు నా దాకా వచ్చాయి. నేను ఆమెకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. అందులో ఒక నటిపై దారుణమైన సన్నివేశాలు చిత్రీకరించారు. తనను అత్యాచారం చేయాలని చూసిన వ్యక్తితోనే ప్రేమలో పడినట్లు చూపారు. ఇలాంటివన్నీ ఏంటి ? ముందు వీటి గురించి తెలుసుకోండి. తర్వాత నా సినిమాలను విమర్శించండి’ అంటూ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ రావు, సందీప్ వంగా మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొంతమంది సందీప్ వంగాను సమర్ధిస్తే… మరికొందరు కిరణ్ రావు వ్యాఖ్యలను సమర్దిస్తున్నారు.
తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్’ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా వసూళ్లు ‘యానిమల్ పార్క్’ తీయబోతున్నట్లు సినిమాలో చూపించడంతో పాటు దర్శకుడు సందీప్ అధికారిక ప్రకటన కూడా చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఈ సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ‘‘2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని, ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైనట్లు చెప్పారు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్ పార్క్’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని తెలిపారు. దీనితో యానిమల్ కు ఇంత రియాక్షన్ వస్తే యానిమల్ పార్కు సంగతి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Also Read: Mahesh Babu Daughter Sitara: ‘గుంటూరుకారం’ సాంగ్‌కు సితార డ్యాన్స్ !