Spirit : ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సందీప్ పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ సలార్, కల్కి 2898AD’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన ‘స్పిరిట్(Spirit)’ అనే మూవీ తీయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో.. అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా సందీప్ ఈ సినిమా కోసం ఇద్దరు పవర్ ఫుల్ బాలీవుడ్ కపుల్‌ని విలన్లగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Spirit Movie Updates
‘ఆదిపురుష్, దేవర’ వంటి పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకీ పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక సైఫ్ సతీమణి కరీనా కపూర్ ఎక్కువగా రొమాంటిక్ రోల్స్‌లో కనిపించినా నటన పరంగా ఎప్పుడో లెజండరీ స్టేటస్‌ను పొందింది. ఇక ఈ ఇద్దరినీ సందీప్ తను చేయబోతున్న ప్రభాస్(Prabhas) ప్రాజెక్ట్‌లో విలన్లుగా పవర్ ఫుల్ పాత్రల్లో చూపించాలనుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ‘ఆదిపురుష్’ సినిమాలో డైరెక్టర్ ఓం రౌత్.. సైఫ్ నటనా సామర్ధ్యాన్ని ఏ మాత్రం వాడుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఇక ‘దేవర’లో సైఫ్ రోల్ ఎంతమేరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది ఈ వీక్‌లో తెలిసిపోతుంది. ఏదేమైనా నటులను సాన పెట్టడంలో సందీప్ స్టైలే వేరు. ఇక సైఫ్, కరీనా లాంటి యాక్టర్స్ దొరికితే మాస్ ర్యాంపేజే అంటూ సినీ ప్రేమికులు గుసగుసలాడుతున్నారు.
ప్రస్తుతం సైఫ్ ‘జ్యువెల్ థీఫ్: ది రెడ్ సన్ చాప్టర్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక కరీనా కపూర్ ఈ ఏడాది రిలీజైన ‘క్రూ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుంది. ప్రస్తుతం రోహిత్ శెట్టి యూనివర్స్‌లోని ‘సింగం’ ఫ్రాంచైజీలో ‘సింగం అగైన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రభాస్(Prabhas).. మారుతితో ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడితో ‘ఫౌజి’, నీల్‌తో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి 2898 AD పార్ట్ 2’ చిత్రాలతో పాటు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌లలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా మూడు చిత్రాలతో వివాదాలు, రికార్డులు, సంచలనాలు సృష్టించిన సందీప్ ఈ సినిమాతో ఏం మ్యాజిక్ చేయనున్నాడనేది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.
Also Read : Devara Collections : ‘దేవర’ మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి మరి..