Sai Pallavi : మలయాళ కుట్టి సాయి పల్లవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తను వెరీ వెరీ స్పెషల్. ఎలాంటి భేషజాలంటూ ఉండవు. అత్యంత సహజ సిద్దంగా ఉండే పాత్రలను ఇష్ట పడుతుంది. వాటినే ఎంచుకుంటుంది. కథ ఎప్పుడూ భావోద్వేగాలను ప్రతిఫలించేలా ఉంటేనే ఓకే చెబుతుంది.
Sandeep Reddy Vanga Praises Sai Pallavi
లేదంటే ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా డోంట్ కేర్ అంటుంది. ఇది తన కేరెక్టర్. అలా అని ఎక్కువగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోదు. తను ప్రాజెక్టు ఒప్పుకుంటే అది పూర్తయ్యేంత వరకు వంద శాతం పెర్ ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది సాయి పల్లవి.
ఈ మధ్యన పలువురు దర్శకులు తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చందూ మొండేటి అయితే మరో ఛాన్స్ అంటూ ఉంటే తనతోనే సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే తను నా కూతురు కంటే ఎక్కువంటూ పేర్కొన్నాడు. తండేల్ మూవీ ప్రమోషన్స్ సందర్బంగా పాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి(Sandeeep Reddy Vanga) షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాను అర్జున్ రెడ్డి మూవీ కోసం ముందు సాయి పల్లవిని అనుకున్నానని, కానీ పాత్రకు సరిపోదని వేరే యాక్టర్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే తను 10 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంటూ కితాబు ఇచ్చాడు. అంతే కాదు తన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం తనకు నచ్చేలా చేసిందన్నాడు. ఎప్పటికైనా సాయి పల్లవితో సినిమా తీస్తానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు వంగా సందీప్ రెడ్డి.
Also Read : Chandoo Mondeti Shocking : వామ్మో సాయి పల్లవితో చాలా కష్టం