Mazaka Movie : సంక్రాంతి బరిలో హీరో సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి...

Hello Telugu - Mazaka Movie

Mazaka : యంగ్ హీరో సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా(Mazaka)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్ వివరాలను మేకర్స్ తెలియజేశారు.

Mazaka Movie Updates

20 రోజుల ఈ లెన్తీ షెడ్యూల్‌లో సందీప్ కిషన్(Sundeep Kishan), ఇతర ముఖ్యమైన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి బుల్లోడు అవతార్‌లో సందీప్‌కిషన్‌ను ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పోస్టర్ పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ప్రామిస్ చేసింది. అయితే ప్రస్తుతం సంక్రాంతికి ఉన్న కాంపిటేషన్ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో సక్సెస్ ఫుల్ అసోషియేషన్‌ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ తెలుపుతున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read : Naga Vamsi : ‘లక్కీ భాస్కర్’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగ వంశి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com