Samyuktha Menon: ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్’ లో దగ్గబాటి రానా భార్యగా చిన్న పాత్రలో నటించినప్పటికీ… అది పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఆమెకు కావాల్సిన దాని కంటే ఎక్కువ ప్రచారం వచ్చింది. దీనికి తోడు ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఫ్రీగా వచ్చిన పాపులారిటీకు… అదృష్టం కూడా తోడవటంతో ఆమె పట్టిందల్లా బంగారం అయిపోయింది.
Samyuktha Menon Marriage Updates
‘భీమ్లా నాయక్’ తరువాత వరుసగా ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘సర్’, ‘డెవిల్(Devil)’ సినిమాలలో నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త(Samyuktha Menon). అయితే వరుసగా ఐదు సినిమాలు హిట్ అయినప్పటికీ… సంయుక్త కొత్త సినిమాలను ఒప్పుకోకపోవడం లేదనే టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది. దీనితో సంయుక్త పెళ్లికి సిద్ధమవడంతో కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనే పుకార్లు ప్రారంభమయ్యాయి. ఇక వరుడు విషయానికి వస్తే… ఆమె బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే అతను ఎవరో, ఎక్కడ పనిచేస్తారో అనే విషయం మాత్రం ఎక్కడా బయటపడలేదు. కానీ ఈ సంవత్సరం సంయుక్త పెళ్ళి చేసుకోవడం ఖాయం అని మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
2016లో పాప్ కార్న్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లోకల్ బ్యూటీ… ఆ తరువాత కన్నడ, హిందీ, తెలుగు బాషల్లో నటించింది. తెలుగులో ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘సర్’, ‘డెవిల్’ వరుసగా ఐదు హిట్ సినిమాల్లో నటించి… సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే అందులో ‘భీమ్లా నాయక్’ మినహా అన్నీ పీరియాడిక్ డ్రామాలు కావడం విశేషం. అయితే వరుస హిట్ సినిమాలు చేస్తున్నప్పడు బ్రేక్ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రారంభమైన ప్రచారం… ఆమె పెళ్ళి వద్దకు వెళ్ళిపోయింది. అయితే 28 ఏళ్ల సంయుక్త కి ఇంకా చాలా భవిష్యత్తు వుంది. ఇటీవల కాలంలో వివాహం చేసుకున్న నటీమణులు కూడా బాగా రాణిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే మరి సంయుక్త వివాహం అయ్యాక సినిమాలలో నటిస్తుందా, లేక సినిమాలకు పూర్తిగా బాయ్ చెప్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు.
Also Read : Shine Tom Chacko: ‘దసరా’ విలన్ కు నిశ్చితార్ధం !