Samuthirakani: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు సముద్రఖని. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా ఇలా ఏం చేసినా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు సముద్రఖని. అలా వైకుంఠపురములో సినిమాతో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని, ఇటీవల విమానం సినిమాతో ప్రేక్షకుల మనసులను హత్తుకున్నారు.
వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమాకు దర్శకత్వం వహించి… స్టార్ డైరెక్టర్ గా మారారు. అయితే తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి… సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు… ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పనులు మొదలైనట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Samuthirakani – సిపిఐ(ఎంఎల్) ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాత్రలో సముద్రఖని ?
తెలంగాణకు చెందిన గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో సముద్రఖని(Samuthirakani) నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుమ్మడి నరసయ్య యెల్లందు శాసనసభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎంఎల్ – న్యూ డెమోక్రసీ) అభ్యర్థిగా వరుసగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. కానీ ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీసులో పండుకుని ఆటోలో అసెంబ్లీకి వెళ్ళేవాడు. కానీ ఆయనెప్పుడూ పబ్లిసీటీ చేసుకోలేదు. తాను అయిదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేవారు.
అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప రాజకీయ నాయకుడు కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్‌కు తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. అయితే ఈ విషయంపై సముద్రఖని నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : Tripti Dimri: తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన యానిమల్ బ్యూటీ