Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు హీరోగా క్యాన్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మాంక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘సోదరా’. మన్‌మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. దీనితో ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా…’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటని పూర్ణాచారి రాయగా సునీల్ కశ్యప్ సంగీతం అందించి స్వయంగా పాడారు. ఫ్రెష్ ఫీల్‌తో మంచి లవ్ రొమాంటిక్‌గా ఉన్న ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి స్పందన వస్తుంది.
Sampoornesh Babu Movie Updates
‘హృదయకాలేయం’ సినిమాతో సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu).. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు చేస్తున్నారు. ‘కొబ్బరిమట్ట’, ‘క్యాలీఫ్లవర్’ లాంటి సినిమాలతో తన మార్క్ కామెడీను చూపించి బర్నింగ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు. ఇటీవల విడుదలైన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు… బ్రొమంటిక్ స్టోరీతో ‘సోదరా’ సినిమాతో వస్తున్నారు. పేరడీ హీరోగా, కమెడియన్‌గా ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు… ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా…’ మరింత దగ్గరయ్యేలా కనిపిస్తున్నారు.
Also Read : Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం