తెలుగు సినీ పరిశ్రమలో నేచురల్ స్టార్ గా పేరు పొందారు సంపూర్ణేష్ బాబు. తీసినవి కొన్ని చిత్రాలే అయినా అవి ఊహించని రీతిలో జనాదరణ పొందాయి. మంచి నటుడిగా మార్చేలా చేశాయి. తాజాగా తను నటించిన మార్టిన్ లూథర్ కింగ్ పై ఎక్కువగా నమ్మం పెట్టుకున్నాడు ఈ స్టార్.
కొంత గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి దాకా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలతో మంచి గుర్తింపు లభించింది తనకు. ఆ రెండు మూవీస్ తర్వాత విడుదలైన మూవీస్ నిరాశ పరిచాయి.
లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు మార్టిన్ లూథర్ కింగ్ గా. ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రముఖ తమిళ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సంపూ కీ రోల్ పోషిస్తుండా వెంకటేశ్ మహా, నరేష్ ఇతర పాత్రలలో ఉన్నారు.
అయితే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా మార్టిన్ లూథర్ కింగ్ అప్ డేట్ ఇచ్చారు. అక్టోబర్ 27న మూవీని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు పూజా ప్రకటించారు.