Sampoornesh Babu : హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న సంపూర్ణేశ్ బాబు తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ (యోగిబాబు ప్రధాన పాత్రధారి)కు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులు రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఓటు విలువ చాటి చెప్పే పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా… అక్టోబరు 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించింది.
Sampoornesh Babu – ‘సోనీలివ్’ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైన సంపూ ‘మార్టిన్ లూథర్ కింగ్’
సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా ఓటీటీ విడుదల తేదీను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం యాజమాన్యం ‘సోనీలివ్’ తాజాగా ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్లలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ‘సోనీలివ్’ యాజమాన్యం ప్రకటించింది. దీనితో ఇప్పటికే తమిళంలో నిర్మించిన మండేలా సినిమాను ఓటీటీలో చూసిన అభిమానులు… ‘మార్టిన్ లూథర్ కింగ్’ లో సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) ఫెర్మామెన్స్ ను చూడటానికి ఆశక్తిగా ఎదురూస్తున్నారు. ఓటు విలువ చెప్పే పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ కావడం… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తుండంతో ఈ సినిమా విడుదలపై ఆశక్తి నెలకొంది.
Also Read : Saindhav: రాంగ్ యూసేజ్ చెయ్యొద్దు అంటున్న విక్టరీ వెంకటేష్