Samantha : ఫ్యామిలీ మాన్ దర్శకుడితో సమంత ఎంగేజ్మెంటా.?

సమంత తెలుగు వాళ్లైన రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని చ‌ర్చ న‌డుస్తోంది...

Hello Telugu - Samantha

Samantha : ఇటీవ‌ల నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వారి ఇంట్లో ఎంత అనందాన్ని తీసుకువ‌చ్చిందో తెలియ‌దు గానీ మీడియాకు మాత్రం నెల రోజుల‌కు స‌రిపోను కంటెంటు, వ్యూస్‌ను అందించింది. ఎవ‌రికి వారు రేగి కాయంత అంశాన్ని తాటికాయంతగా మార్చి ఎవ‌రికి వారు త‌మ ఇష్టానుషారంగా మ‌లుచుకుని సోష‌ల్ మీడియాలో వండి వ‌డ్డించారు. ఇంకా అది పూర్తిగా జీర్ణం కాక మునుపే తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చి యూట్యూబ‌ర్స్‌, ఇత‌ర మీడియాల‌కు మ‌రో రెండు మూడు నెల‌ల‌కు స‌రిపోను కంటెంటును తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ వార్త నేష‌న‌ల్ వైడ్‌గా బాగా వైర‌ల్ అవుతోంది. విష‌యానికి వ‌స్తే.. వారం క్రింద‌ట నాగ చైత‌న్య ,శోభిత ఎంగేజ్‌మెంట్ జ‌రిగి ఇంకా వారం కూడా కాకముందే ఇప్పుడు సమంత(Samantha) ఎంగేజ్మెంట్ అంటూ మరో వార్త సోషల్ మీడియాలో తెగ‌ చక్కర్లు కొడుతొంది. అంతేకాదు ఇప్పటికే సమంత ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లుగా ఒక నేషనల్ పోర్టల్‌లో వార్త రావటం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్‌గా మారింది.

Samantha Engagement..

సమంత తెలుగు వాళ్లైన రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని చ‌ర్చ న‌డుస్తోంది. అయితే స‌మంత గతంలో రాజు డీకేతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చేయ‌గా అందులోని స‌మంత పాత్ర కాంట్రవర్సీలకు దారి తీసింది.. ఆ తర్వాతే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. కాగా తాజాగా ఒక జాతీయ‌ పోర్టల్లో వచ్చిన కథనం ప్రకారం.. రాజ్, సమంత(Samantha) చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారని.. రాజ్‌కి ఇప్పటికే వివాహం జరిగి ఉండ‌డంతో.. సమంతతో ప్రేమ నేపథ్యంలో అతని భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో రాజ్ ఉన్నట్లు సదరు వార్తా కథ‌నంలో ఉంది.. అయితే దీనిలో ఎంత నిజముందనేది క్లారిటీ లేదు. ఇదిలాఉండ‌గా స‌మంత ప్ర‌స్తుతం రాజ్ డీకే దర్శకత్వంలోనే సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేయ‌గా ఫ్యామిలీమెన్ 3 సిరీస్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అంతేకాదు విడాకుల తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే ఘనంగా నిర్వహించటం అప్ప‌ట్లో చర్చనీయాంశమైంది కూడా.

Also Read : Venu Swamy : ఇకపై ఎప్పుడు సినిమా వాళ్ళ జాతకాలు చెప్పను

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com