Samantha : చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు సమంత.. మరి ఆమె ఏం మాట్లాడారు.? మళ్లీ తెలుగు సినిమాలు చేస్తారా లేదంటే చుట్టపు చూపుగానే ఇలా హైదరాబాద్‌కు వచ్చారా.? అసలు స్యామ్(Samantha) ఏం ప్లాన్ చేస్తున్నారు.? ఈ భామ కోసం మన దర్శకులు మళ్లీ కథలు రాయొచ్చా.? ఇకపై రెగ్యులర్‌గా సమంతను టాలీవుడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా.? సమంతను టాలీవుడ్ దాదాపు మరిచిపోయింది.. అలాగే సమంత కూడా తెలుగు ఇండస్ట్రీని ఆల్‌మోస్ట్ దూరం పెట్టేసారు. ఈ రెండూ తెలియకుండానే జరిగిపోతున్నాయి. తాజాగా జిగ్రా ప్రీ రిలీజ్‌లో త్రివిక్రమ్ కూడా ఇదే మాట అన్నారు. అప్పుడప్పుడూ హైదరాబాద్ వస్తూ పోతుండండి.. మీరు రావట్లేదనే మేం కూడా కారెక్టర్స్ రాయట్లేదన్నారు గురూజీ. కొన్ని నెలలుగా ముంబైలోనే ఉంటున్నారు సమంత. అక్కడే బిజీ అయిపోయారు.
Samantha..
వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. ఇలాంటి సమయంలో జిగ్రా ప్రీ రిలీజ్ కోసం హైదరాబాద్ వచ్చారీమె. చాలా రోజుల తర్వాత స్యామ్ రావడంతో.. ఫ్యాన్స్ కూడా ఆమెను చూసి ఖుషీ అయిపోయారు. సమంత ప్రస్తుతం హిందీలోనే నటిస్తున్నారు.. కనీసం తమిళ సినిమాలు కూడా చేయట్లేదు. ఇక తెలుగు సినిమాలైతే దాదాపు మరిచిపోయారు. తాజాగా త్రివిక్రమ్ కామెంట్స్‌తో సమంత మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తారా అనేది ఆసక్తికరమే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ త్వరలోనే అల్లు అర్జున్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా సమంతను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నిజమైతే స్యామ్‌కి ఇంతకంటే బెస్ట్ కమ్ బ్యాక్ ఉండదు. బన్నీతోనూ సన్నాఫ్ సత్యమూర్తితో పాటు పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేసారు సమంత.
Also Read : Pushpa 2 : రిలీజ్ కు ముందే రికార్డుల సంచలనం సృష్టిస్తున్న ‘పుష్ప 2’