Samantha Vijay Kiss : శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీ మూవీ వైరల్ గా మారింది. ఇందులో నటించిన సమంత, విజయ్ దేవరకొండ రెచ్చి పోయి నటించారు. ప్రత్యేకించి రొమాన్స్ పండించారు. ముద్దు మురిపెంతో ఆకట్టుకున్నారు.
Samantha Vijay Kiss Viral
రిలీజైన నాటి నుంచి నేటి దాకా వసూలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రధానంగా యువతను ఎక్కువగా మెస్మరైజ్ చేస్తోంది. హషీమ్ అబ్దుల్ వాహాబ్ అందించిన సంగీతం దేశాన్ని ఉర్రూత లూగించింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు గుండెల్ని మీటుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ఖుషీని(Kushi) నిర్మించారు. శివ నిర్వాణ రచన, స్క్రీన్ ప్లే , పాటలు కూడా రాశాడు శివ నిర్వాణ. మొత్తంగా అసలు సిసలైన ప్రేమను తెర మీద ప్రతిఫలించేలా చేయడం జరిగిందని చెప్పాడు దర్శకుడు.
మరో వైపు సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సమంత రుత్ ప్రభును ఎత్తుకోవడం, హత్తు కోవడం , షర్ట్ విడిచి డ్యాన్స్ చేయడం వైరల్ గా మారింది.
ఖుషీ చిత్రంలో బాత్రూం సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. సమంత మరీ ఓవర్ గా నటించడం ఎందుకని ఆమె అభిమానులు వాపోతున్నారు.
Also Read : Dunki Movie : డుంకీ మూవీపై షారుక్ ఫోకస్