Samantha : నటి సమంత రుత్ ప్రభు గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా మారి పోయింది . తను నేచురల్ లవర్. అంతే కాదు జంతువులన్నా ఇష్టమే. తాజాగా తను నిర్మాతగా మారినట్లు సమాచారం. రాబోయే తెలుగు చిత్రం మా ఇంటి బంగారం కోసం తను నిర్మాతగా వ్యవహరించనుంది. ఇందులో పని చేసే ప్రతి ఒక్కరికీ తేడా అన్నది లేకుండా అందరికీ సమాన పారితోషకం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో.
Samantha As a Producer
గౌతమ్ వాసుదేవ మీనన్ పుణ్యమా అని సమంత రుత్ ప్రభు(Samantha) మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను నాగ చైతన్యతో కలిసి ఏమాయ చేశావే చిత్రంలో నటించింది అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరుసగా పలు విజయవంతమైన తెలుగు, తమిళ సినిమాలలో నటించింది. ఇదే సమయంలో హిందీలోకి కూడా ఎంటర్ అయ్యింది. ఉన్నట్టుండి చైతుతో పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత ఎందుకనో విడి పోయారు. కొద్ది కాలం బాగానే ఉన్నారు. ప్రస్తుతం తను వెబ్ సీరీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో దర్శక, నిర్మాత రాజ్ నిడమూరుతో డేటింగ్ చేస్తందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా తను నిర్మాతగా మారిన విషయం గురించి సమంత ఫ్రెండ్, దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించింది. తను ఈ సినిమాలో పని చేసే ప్రతి ఒక్కరికీ తేడా అన్నది తేలకుండా రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇదే గనుక విజయం సాధిస్తే కొత్త పద్దతికి శ్రీకారం చుట్టినట్లవుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ తర్వాత హీరోయిన్ల కు దక్కుతుంది. మిగతా పాత్రలలో నటించే వారికి, టెక్నీషియన్స్ కు చాలా తక్కువ పారితోషకంతో సరి పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
Also Read : Popular Singer Gaddar Awards :గద్దర్ సినీ పురస్కారాలకు నోటిఫికేషన్