ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రతి నెలా ఎవరు పాపులర్ అనే దానిపై సర్వే చేపడుతుంది. సోషల్ మీడియాలో ఇతర విభాగాలలో అత్యంత ప్రభావితం చూపిన హీరోయిన్లు ఎవరనే దానిపై ఉత్కంఠకు తెర దించింది.
రౌడీ బాయ్ గా పేరు పొందిన విజయ్ దేవరకొండతో ఇటీవల నటించిన ఖుషీ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ఫ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో దర్శకుడు ఏరికోరి సమంత రుత్ ప్రభును స్పెషల్ సాంగ్ లో నటింప చేశాడు.
చంద్రబోస్ రాసిన ఊ అంటావా సాంగ్ రికార్డుల మోత మోగించింది. పుష్పలో రష్మిక మందన్నా నటించినా సమంతకు వచ్చిన పేరు ఆమెకు రాలేదు. దీంతో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది.
ఆర్మాస్ మీడియా ప్రకటించిన జాబితాలో 1వ స్థానంలో సమంత ఉండగా 2వ స్థానంలో కాజల్ అగర్వాల్ , 3వ స్థానంలో అనుష్క శెట్టి, 4వ స్థానంలో శ్రీలీల, 5వ స్థానంలో సాయి పల్లవి, 6వ స్థానంలో రష్మిక మందన్నా, 7వ స్థానంలో కీర్తి శెట్టి, 8వ స్థానంలో తమన్నా భాటియా, 9వ స్థానంలో పూజా హెగ్డే, 10వ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.