Samantha : చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా సమంత రుత్ ప్రభు(Samantha) కొనసాగుతోంది. తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో నటిస్తోంది. ప్రస్తుతం బిజీగా ఉంది. ఏ మాత్రం వీలు చిక్కినా ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అంతే కాదు పుస్తకాలను చదువుతుంది. అంతే కాదు మెడిటేషన్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. జగ్గీ వాసుదేవన్ శిక్షణా తరగతులకు హాజరవుతుంది. గురూజీని ఆ మధ్య ఇంటర్వ్యూ కూడా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Samantha Shocking Updates
తాజాగా సమంత రుత్ ప్రభు సంచలనంగా మరారు. మూడు రోజుల పాటు ఆమె సైలెంట్ మూడ్ లోకి వెళ్లారు. ఎవరితోనూ కనెక్ట్ కాకుండా ఫోన్ లు లేవు, పలకరింపులు అసలేమీ లేవు. అంతర్గత శాంతి కోసం కమ్యూనికేషన్ లేకుండా పోవడం విస్తు పోయేలా చేసింది. అక్కినేని నాగ చైతన్యతో విడి పోయాక కొంచెం డిస్ట్రబ్ అయ్యింది సమంత రుత్ ప్రభు. ఇదే సమయంలో ఆమెకు ఆటో-ఇమ్యూన్ డిసీజ్ మైయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది . దానిని అధిగమించడానికి ఆమె చాలా కష్టపడింది.
సమంత సినిమాల నుండి విరామం తీసుకుంది. అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం ధ్యానాన్ని ప్రస్తుతం ఆశ్రయించింది. ప్రస్తుతం సినిమాలలో సంతకం చేయలేదు. కానీ వెబ్ సీరీస్ లలో ఎక్కువగా కనిపిస్తోంది. సమంత రూత్ ప్రభు అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నారు. మూడు రోజులు పూర్తి నిశ్శబ్దాన్ని స్వీకరించారు. కేవలం ఏకాంతాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకుంది. నిశ్శబ్ద తిరోగమనాన్ని సవాలుతో కూడినది, పరివర్తన కలిగించేది అని వర్ణించారు.
Also Read : Mad Square Sensational :మ్యాడ్ 2 పిచ్చెక్కించడం పక్కా