Samantha : బహు భాషా నటిగా గుర్తింపు పొందింది సమంత రుత్ ప్రభు. తను తమిళం, తెలుగు, హిందీ భాషలలో ప్రస్తుతం బిజీగా ఉంది. అంతే కాదు ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సీరీస్ తో బిజీగా మారి పోయింది. ఈ మధ్యన నిత్యం వార్తల్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తనపై తనకు నమ్మకం ఎక్కువ. ప్రత్యేకించి తనకు ప్రకృతి అంటే విపరీతమైన అభిమానం. ఏ మాత్రం వీలు దొరికినా, సమయం ఉన్నా వెంటనే కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్ట పడుతుంది. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేందుకు సైతం వెనుకాడదు.
Samantha Viral at Social Media
ఇది తన ప్రత్యేకత. ఎవరి గురించి పట్టించుకోదు. ఇదే తనను ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని చెప్పింది. ఆ మధ్యన విజయ్ దేవరకొండతో ఖుషీలో నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం వెబ్ సీరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ ముద్దుగుమ్మను సినీ రంగానికి పరిచయం చేసింది మాత్రం తమిళ సినీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్. తను దర్శకత్వం వహించిన చిత్రం ఏమాయ చేశావే. ఇది అటు తమిళంలో ఇటు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాసుల వర్షం కురిపించింది. ఇందులో నటించిన సమంత రుత్ ప్రభుకు(Samantha) మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది..మెప్పించింది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇదే సమయంలో ఏమాయ చేశావే అంటూ నటించిన చిత్రంలో కథా నాయకుడిగా ఉన్న అక్కినేని నాగ చైతన్యను ప్రేమించింది. అందరి సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఎందుకనో తామిద్దరం విడి పోతున్నామంటూ ప్రకటించింది. తాజాగా వెబ్ సీరీస్ తీస్తున్న దర్శక, నిర్మాత రాజ్ నిడుమూరుతో డేటింగ్ లో ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తను విడి పోయినా తన చేతికి నాగ చైతన్య పేరుతో టాటూ ఉండేది. ప్రస్తుతం దానిని తీసేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Hero Mahesh Babu – Athadu : అతడు ప్రభంజనం టెలికాస్ట్ లో సంచలనం