Samantha Ruth Prabhu: కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు… సమంత ‘బంగారం’లాంటి కబురు చెప్పారు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ తో కూడిన పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ‘మా ఇంటి బంగారం’ లో ఆమె నటిస్తున్నట్లు ఆమె పోస్టర్ వేదికగా తెలిపారు. పేరు సాఫ్ట్ గా ఉన్నా పోస్టర్ లో ఈ హీరోయిన్ లుక్ మాత్రం చాలా వైలెంట్‌గా కనిపిస్తోంది.
సమంత(Samantha Ruth Prabhu) తుపాకీ పట్టుకుని కనిపించి… సినిమాపై ఆసక్తి పెంచారు. మరి ఈ గృహిణి కథేంటి ? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే సామ్ టైటిల్ మినహా దర్శకుడు, సాంకేతిక బృంద వివరాలు పంచుకోలేదు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పై రూపొందుతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ సర్ ప్రైజ్‌తో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘తలైవి ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Samantha Ruth Prabhu Comment
గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత… కొత్త చిత్రాలను ఖరారు చేయలేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ఇటీవల కాస్త బ్రేక్ తీసుకున్నారు. తాజాగా మయోసైటిస్ నుంచి కోలుకుని …మళ్లీ నటనపై దృష్టిపెట్టారు. గతేడాది సెప్టెంబరులో ‘ఖుషి’తో అలరించిన ఆమె.. వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ- బన్నీ’ తో త్వరలోనే సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Dear OTT : ఓటీటీలో అలరిస్తున్న ‘డియర్’ కామెడీ మూవీ