ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె నటుడు నాగ చైతన్యతో విడి పోయాక మరింత స్వేచ్ఛను తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఖుషీలో నటించింది. ఇది మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ సాంగ్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
నటి సమంత గత కొంత కాలం నుంచి మయో సైటిస్ అనే విచిత్రమైన వ్యాధితో బాధ పడుతున్నారు. తనను తాను సంభాలించుకునేందుకు గాను ఎక్కువగా ఇతర దేశాలను సందర్శిస్తున్నారు. మనసుకు స్వాంతన కలిగించేలా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు నటి సమంత. తాను ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు లేదా లోన్లీగా అనిపించినప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా చూస్తానని, అదే తనను హ్యాపీగా ఉండేలా చేస్తుందని స్పష్టం చేసింది సమంత. సో ఇప్పుడు సామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.