Samantha : జీవితంలో దేనినైనా భరించవచ్చు. కానీ ఒంటరిగా ఉండడం మాత్రం తట్టుకోలేమంటూ వాపోయారు పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha). తను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంతే కాకుండా అనుకోకుండా ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. ఇంకొకరైతే తీవ్ర నిరాశకు లోనయ్యే వారు. కానీ తాను మాత్రం ధైర్యంగా ఎదుర్కొంది. ఓ వైపు సినిమాలలో మరో వైపు వెబ్ సీరీస్ లలో నటిస్తూ తనను తాను మరిచి పోయేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చింది.
Samantha Feels Despair
ఇదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నం కావడం మొదలు పెట్టింది. ఎన్ని కోట్లున్నా మనకంటూ మనల్ని పట్టించుకునే వారు దగ్గర లేక పోతే తట్టుకోవడం మాత్రం కష్టమంటూ పేర్కొంది సమంత రుత్ ప్రభు. చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని భావాలను పంచుకుంది. ఎవరూ కూడా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నం చేయొద్దంటూ సూచించింది.
ఇదిలా ఉండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏం మాయ చేశావే మూవీలో సమంతను ఏరికోరి తీసుకున్నాడు. అందులో అక్కినేని నాగ చైతన్య హీరో. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇద్దరూ అప్పటి నుంచి లవ్ లో పడ్డారు. చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ వారి మధ్య ఓ వెబ్ సీరీస్ లో రెచ్చి పోయి నటించడంతో తట్టుకోలేక పోయారు. విడిపోతున్నట్లు ప్రకటించారు. చైతు ధూళిపాళతో పెళ్లి చేసుకోగా ప్రస్తుతం సమంత రుత్ ప్రభు ఒంటరిగా ఉంటోంది. తాజాగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : KCR Shocking Comment :చరిత్ర ప్రసవంచిన బిడ్డ బీఆర్ఎస్