Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఈ మధ్యన విచిత్రంగా మాట్లాడుతున్నారు. వారంతా వేదాంత ధోరణితో కామెంట్స్ చేయడం విస్తు పోయేలా చేస్తోంది అభిమానులను. పాన్ ఇండియా హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన్నా ఉన్నట్టుండి ఛాయా చిత్రం టీజర్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాగున్నప్పుడే రిటైర్ అయితే బెటర్ అంటూ పేర్కొన్నారు. దీంతో వైరల్ గా మారారు.
Samantha Shocking Comments Viral
తాజాగా మరో ఇండియన్ స్టార్ యాక్టర్ సమంత రుత్ ప్రభు(Samantha) వేదాంతం వల్లె వేశారు. జీవితం చాలా చిన్నది. కాలం విలువైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరగా, వారి మనసు నొప్పించకుండా , చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉండే పాత్రలను మాత్రమే ఏరికోరి ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది సమంత రుత్ ప్రభు.
ఓ వైపు సినిమాలతో పాటు మరో వైపు వెబ్ సీరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. ఈ మధ్యనే తను నాగ చైతన్యతో బ్రేకప్ చెప్పింది. తను పెళ్లి కూడా చేసుకున్నాడు శోభిత ధూళిపాళతో. ఇక సమంత విషయానికి వస్తే తన తండ్రిని ఇటీవలే పోగొట్టుకుంది. తనకు అన్నీ తానైన తండ్రి లేక పోవడం అతి పెద్ద శూన్యం ఆవహించిందంటూ పేర్కొంది సమంత. మొత్తంగా నటి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : Save The Tigers OTT : వెబ్ సీరీస్ లలో సేవ్ టైగర్సా మజాకా