టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు బిజీగా మారారు. ఆమె రౌడీ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. దీంతో వింత వ్యాధితో బాధ పడుతున్న సమంత ఉన్నట్టుండి రిలీజ్ అయిన వెంటనే హాలిడే వెకేషన్ కోసమని వెళ్లింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో సేద దీరుతోంది ఈ అమ్మడు.
నాగ చైతన్యతో విడిపోయాక ఇటు బుల్లి తెరపై అటు సినిమా రంగంలో చాలా అవకాశాలు దక్కించుకుంది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సమంత మిగతా నటీనటుల కంటే ముందంజలో ఉంటుంది సోషల్ మీడియాలో . ఎప్పటికప్పుడు తన టూర్ కు, సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది.
నీటి ప్రాంతపు ఒడ్డున సైకిల్ పై షికారు చేస్తూ కనిపించారు నటి సమంత రూత్ ప్రభు. అంతులేని ఆనందాన్ని పొందుతున్నానని పేర్కొంది . సైట్ సీయింగ్ అద్భుతంగా ఉందంటూ తెలిపింది. దీనిని మరిచి పోలేక పోతున్నానని తెలిపింది.
ఈ సందర్భంగా తన అనుభవాలను కూడా పంచుకుంది సమంత. తన చిన్నతంలో తనను ఎక్కువగా ప్రభావితం చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని తెలిపింది.