నటి సమంత రుత్ ప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. తను నటించిన ఖుషీ సక్సెస్ అయ్యింది. కాక పోతే కొంచెం అనారోగ్యానికి గురి కావడంతో అమెరికా వెళ్లింది. సమంతకు సాధ్యమైనంత మేర నేచర్ ను చూడటమంటే ఇష్టం. ప్రకృతి ఆరాధన ఎంత బాగుంటుందోనని పేర్కొంటుంది. ఏ మాత్రం వీలు దొరికినా లేదా సమయం ఉంటే వెంటనే ఇతర దేశాలను సందర్శించేందుకు ప్రయారిటీ ఇస్తుంటుంది.
ఇక ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించి చూస్తే ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. ఎందులో అంటే సోషల్ మీడియాలో. తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటుంది. ఫ్యాన్స్ తో సంభాషిస్తుంది. అంతే కాదు వారు వేసే ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుంది.
ఇక ఖుషీలో రౌడీ బాయ్ గా పేరు పొందిన విజయ్ దేవరకొండతో కొంచెం మోతాదుకు మించి హద్దులు దాటిందన్న ఆరోపణలు లేక పోలేదు. తాజాగా ఫుల్ జిమ్ లో ప్రాక్టీస్ చేస్తోంది నటి సమంత రుత్ ప్రభు. ఇప్పుడు ఒకే ఒక్క సాంగ్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ మూవీ పుష్ప ది రైజ్. తను నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా సాంగ్.