Samantha : మరోసారి కీలక వ్యాఖ్యలు వెల్లడించిన సమంత

తాజాగా సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ విడుదలైన సంగతి తెలిసిందే!..

Hello Telugu - Samantha

Samantha : ప్రేమ, రిలేషన్‌షిన్‌, భార్యభర్తలు ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఎవరైనా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం సాధారణమే! గతంలో నాగ చైతన్య సమంత(Samantha) సైతం పెళ్లికి ముందు, తరువాత ఎన్నో కాస్ట్‌ లీ గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని మూడేళ్లు కావొస్తుంది. విడాకులకు ఎవరి కారణాలు వారు చెప్పుకొచ్చారు. చై-సామ్‌ల విడాకుల గురించి ఎన్నో ప్రచారాలు జరిగినప్పటికీ ఒకరి మీద ఒకరు కామెంట్స్‌ చేసుకోలేదు. గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అదంతా గతం.. చైతన్య మరికొద్ది రోజుల్లో శోభితాతో వివాహానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సమంత తన మాజీ భర్త నాగచైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Samantha Comment

తాజాగా సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ విడుదలైన సంగతి తెలిసిందే! ప్రమోషన్స్‌లో భాగంగా సమంత వరుణ్‌ ధావన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఖరీదైన గిఫ్ట్‌ ఎవరికైనా ఇచ్చి వృధా అయిందే అనుకున్న సందార్భాలున్నాయా? అన్న ప్రశ్నకు ుూనా ఎక్స్‌కు ఇచ్చిన ఖరీదైన బహుమతి’ అని సామ్‌ సమాధానం ఇచ్చారు. ముగిసిపోయిన రిలేషన్‌లో ఇచ్చిపుచ్చకున్న వస్తువులపై ఇప్పుడు సమంత స్పందించటం చర్చనీయాశమైంది. ఆమె చెప్పిన సమాధానం ప్రాక్టికల్‌గా ఆమెకు సరైనదే అనిపించవచ్చు కానీ చైతన్య కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆమె ఈ తరహా కామెంట్స్‌ చేయటం అక్కినేని ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. అయితే బహుమతులు సమంత మాత్రమే ఇవ్వలేదని.. చైతన్య కూడా ఎన్నో ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారని ఏదేమైనా ఇన్నాళ్లు వివాహ బంధంపై గౌరవంగా వ్యవహరించిన సమంత.. ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఆమె విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు, అభిమానులు.

Also Read : Abhishek Bachchan : తన భార్య ఐశ్వర్య రాయ్ కి అభినందనలు తెలిపిన అభిషేక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com