Samantha : ఓ వైపు సినిమాలు ఇంకో వైపు వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha) ఉన్నట్టుండి తానే నిర్మాతగా మారి పోయింది. అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. అంతే కాదు సామాజిక మాధ్యమాలలో మరింత బిజీ అయ్యింది. తనే నిర్మించి నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. దీనిపై భారీ నమ్మకం పెట్టుకుంది ఈ అమ్మడు. తను పాపులర్ అయ్యింది మాత్రం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన పాపులర్ మూవీ ఏమాయ చేశావే. ఇందులో కీ రోల్స్ పోషించారు అక్కినేని నాగ చైతన్య, సమంత.
Samantha-Atlee Movie Updates
ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించింది. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జత కట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తను అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్య మూర్తితో పాటు నితిన్ రెడ్డితో కలిసి నటించింది. బన్నీతో సన్నాఫ్ సత్యమూర్తిలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత అనూహ్యంగా దమ్మున్న దర్శకుడు సుకుమార్ తీసిన పుష్ప-1 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఊ అంటావా ఉఊ అంటావా అంటూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది సమంత రుత్ ప్రభు. బన్నీతో పాటు సమంత రెచ్చి పోయింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ మూవీలో కనిపించింది. తన నుంచి ఇంకా అప్ డేట్స్ రాలేదు. అయితే తాజాగా తమిళ సినీ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee) దర్శకత్వం వహిస్తున్న ఇంటర్నేషనల్ మూవీ లో సమంతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి బన్నీ, సమంత కాంబినేషన్ కు మంచి ఆదరణ లభించడం ఖాయం. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అట్లీ. అయితే సమంత రుత్ ప్రభుకు తమిళ సినీ రంగంలో మంచి పట్టుంది. అక్కడ దళపతి విజయ్ తో నటించింది . ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమే కాలేదు సంచలనంగా మారింది.
Also Read : Hero Prabhas-Maruthi :అభిమానుల ఆందోళన దర్శకుడి స్పందన