Samantha : పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజు రోజుకు సమాజంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Samantha Shocking Comments on…
గత నెల కేరళలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. దీనిపై సినీ సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా, ఎన్ని కేసులు నమోదు చేసినా మహిళలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉందని వాపోయారు నటి సమంత రుత్ ప్రభు(Samantha). ఈ ఘటన తనను కలిచి వేసిందని, తెలిసినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని తెలిపింది.
పిల్లలను ప్రత్యేకించి బాలికలను బయటకు పంపించే ముందు పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణం చోటు చేసుకుంటూనే ఉందన్నారు సమంత రుత్ ప్రభు. మనలో మార్పు రావాలని, ఇందు కోసం మనందరం బాధితుల పక్షాన నిలబడాలని సూచించారు.
Also Read : Victory Venkatesh Movie : వెంకీ మామ మూవీ ఓటీటీ వాయిదా