Samantha : దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత సమంత తెరపై కనిపించింది. అది వెండి తెర మీదు కాదు బుల్లితెరపై. ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది సామ్. ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న ఈ సిరీస్ ఈ నెల ఆరో తేది నుంచి అమెజాన్ ఫ్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ సాధించిన సక్సెస్ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇదే వేదికపై సినిమాల్లో మహిళల పాత్రల గురించి ఆమె మాట్లాడారు. మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనీ, మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం నటిగా తన బాధ్యత అని సమంత(Samantha) అన్నారు.
Samantha Comment
ఆమెమాట్లాడుతూ ‘‘ఆడియన్‌ను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే పాత్రను ఎంచుకునే సమయంలో ఎన్నో విషయాలు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే యాడ్స్ విషయంలోనూ ఆలోచిస్తాను. ‘సిటడెల్: హనీ బన్నీ’లో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర అది. యాక్షన్ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేశా.
కానీ,ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి వాటి కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా సెలక్టివ్‌గానే వెళ్తున్నా. నాకు వచ్చిన ఆఫర్లకు, నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది’’ అని సమంత(Samantha) అన్నారు. సమంత నటించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ర్టీమింగ్ అవుతోంది. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. ప్రస్తుతం సమంత చేతిలో ఇంకే సినిమా లేదు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా ప్రొడక్షన్‌లో ఆమె కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ దర్శకుడు, ఇతర విషయాల గురించి ఎక్కడా అప్‌డేట్ ఇవ్వలేదు. ఆ చిత్రం ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.
Also Read : Rajkumar Hirani : విక్కీ కౌశల్ తో న్యూ ప్రాజెక్ట్ కి సిద్దమవుతున్న డైరెక్టర్ హిరాణీ