Samantha : టాలీవుడ్ నటి సమంత(Samantha) గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటుంది. చివరగా గత సంవత్సరం ఖుషి, శాకుంతలం సినిమాల్లో కనిపించిన ఆమె తాజాగానటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. తనకున్న మయోటైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం సినిమాలను తగ్గించుకుని కొన్ని ప్రైవేట్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతోంది. ఆ మధ్య సాకి అనే బ్రాండ్‌తో అన్‌లైన్‌లో ఓ దుస్తల బిజినెస్ ప్రారంభించిన ఆమె ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక కాన్సెప్ట్ స్కూల్‌లో, ఫ్యాషన్, హోటల్స్ వంటి పలు బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో కొత్త బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
Samantha…
అయితే ఈ సారి ఏకంగా స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్‌తో కలిసి వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో పార్ట్నర్‌గా చెన్నై ఫ్రాంజైజ్ ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని సమంత షేర్ చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను కూడా ప్రారంభించింది. ఇదిలాఉండగా.. ఇటీవల కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూ. డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దారుణంపై పలువురు దేశ వ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ముందుకు వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారు.
ఈక్రమంలో తాజాగా పికెట్ బాల్ లాంచింగ్ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సమంతను ఈ ఘటనపై పలువురు విలేఖరులు ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని ,ఇప్పుడది అవసరం కూడా అని ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Speed 220: ఆసక్తి కరంగా ‘స్పీడ్220’ ట్రైలర్ !