Samantha : సినిమాల్లో స్పీడ్ తగ్గిన…గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ అలానే..

దాదాపు 200 దేశాల్లో ఈ షో ట్రెండింగ్‌లో ఉన్నట్టుగా వెల్లడించారు మేకర్స్‌...

Hello Telugu - Samantha

Samantha : సిల్వర్‌ స్క్రీన్ మీద స్పీడు తగ్గించినా.. డిజిటల్‌లో మాత్రం నెవ్వర్‌ బిఫోర్ రేంజ్‌లో దూసుకుపోతున్నారు స్టార్ హీరోయిన్‌ సమంత. లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌తో రికార్డులు తిరగరాస్తున్న ఈ బ్యూటీ, రీజినల్ కంటెంట్‌కు ఇంటర్నేషనల్ అప్పీల్ ఉంటుందని మరోసారి ప్రూవ్ చేశారు. కొద్ది రోజులుగా వెండితెర మీద స్పీడు తగ్గించిన సమంత(Samantha), సెలెక్టివ్ ప్రాజెక్ట్స్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సినిమాలతో పాటు డిజిటల్ ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. సమంత లీడ్ రోల్‌లో తెరకెక్కిన యాక్షన్ సిరీస్‌ సిటాడెల్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్‌ యాక్షన్ డ్రామాకు ఇండియన్ వర్షన్‌గా రిలీజ్ అయిన సిటాడెల్‌ హనీ బన్నీ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది ఈ షో.

Samantha…

దాదాపు 200 దేశాల్లో ఈ షో ట్రెండింగ్‌లో ఉన్నట్టుగా వెల్లడించారు మేకర్స్‌. పూర్తిగా ఇండియన్ స్టైల్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తో తెరకెక్కిన సిటాడెల్‌కు ఈ రేంజ్‌ రెస్పార్స్ రావటంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సిల్వర్‌ స్క్రీన్ మీద సమంతను మిస్ అవుతున్న ఫ్యాన్స్‌, డిజిటల్‌లో ఆమె సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1990, 2000 మధ్య కాలంలో జరిగే కథగా తెరకెక్కిన సిటాడెల్‌ హనీ బన్నీలో సమంత ఏజెంట్ పాత్రలో నటించారు. హాలీవుడ్ మేకర్స్ రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ షోకు ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Also Read : Allu Arjun-Pawan : పవర్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com