Samantha: తమ్ముడి పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత !

తమ్ముడి పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత !

Hello Telugu - Samantha

Samantha: దక్షిణాది అగ్రతార సమంత ఇంట పెళ్ళి భాజాలు మ్రోగాయి. తన తమ్ముడు డేవిడ్ పెళ్ళి అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్ళి వేడుకలో సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చాలా ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్న సమంత… ఇప్పుడు గొడవలన్నీ క్లియర్ చేసుకుని వాళ్లతో కలిసిపోయినట్లు అనిపిస్తోంది.

Samantha Special Apprection

తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత(Samantha)కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీళ్లలో చిన్నోడే డేవిడ్. ఇతడి పెళ్లి అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగింది. నికోల్ అనే అమ్మాయినతో క్రిస్టియన్ సంప్రదాయంలో ఒక్కటయ్యాడు. ఈ వేడుకలో సమంత తోడు పెళ్లి కూతురిలా (బ్రైడ్స్ మేడ్) కనిపించింది. స్లీవ్‌లెస్ గౌనులో అందంగా మెరిసిపోయింది. ఇక తమ్ముడి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సామ్.. వైట్ హర్ట్, స్పార్కిల్ ఎమోజీతో పాటు ‘ఫ్యామిలీ’ అని రాసుకొచ్చింది.

‘ఏ మాయ చేశావె’ మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత… దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించింది. చివరగా ‘ఖుషి’ సినిమా చేసింది. ప్రస్తుతం ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ చేసింది. నవంబరు 7న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత ఫ్యామిలీకి ఈమెకు మధ్య దూరం పెరిగిందని, అందుకే ముంబైలో ఒంటరిగా ఉందని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తమ్ముడి పెళ్లి వల్ల సమంత మళ్లీ కుటుంబానికి దగ్గరైపోయినట్లు కనిపిస్తోంది.

Also Read : Parvathy Nair: దళపతి విజయ్ హీరోయిన్‌ పై పోలీస్ కేసు ! రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి  !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com