Samantha : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత

ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది...

Hello Telugu - Samantha

Samantha : తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబం , సమంతల(Samantha)పై చేసిన వ్యాఖ్యలపై సమంత మరోసారి స్పందించారు సమంత. తాజాగా ఆమె నటించిన ‘సిటాడెల్‌ హనీ – బన్నీ’వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్‌ మాట్లాడారు. ‘ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఇక్కడ కూర్చోవడానికి ప్రధాన కారణం అభిమానులతోపాటు ఎంతోమంది మద్దతే. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో ఆ మద్దతు నాకెంతో సహాయపడింది. వారు నా పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నేను వాటిని వదులుకోవాలని కూడా భావించేదాన్నేమో. గతంలోనైనా, ఇటీవల జరిగిన విషయాలపైనైనా నా చుట్టూ ఉన్నవారి నమ్మకంతోనే వాటిని ఎదుర్కోగలిగాను’ అని అన్నారు.

Samantha Comment

కొంత కాలంగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే ఆమె ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత మరో చిత్రం అంగీకరించలేదు. గతంలో ప్రారంభించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ను పూర్తి చేశారు. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తన సొంత ట్రాలాలా పిక్చర్‌ మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో మా ఇంటి బంగారం’ చిత్రం ప్రకటించారు. కానీ దీనికి సంబంధించి ఎలాంట అప్‌డేట్‌ లేదు.

Also Read : Pawan Kalyan : ‘ఓజీ’ సినిమా షూటింగ్ షురూ చేసిన హీరో పవర్ స్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com