Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. 58 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సల్మాన్ ఒకరితో సులభంగా ప్రేమలో పడతాడు కానీ పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. సల్మాన్ ఖాన్ సాదాసీదా మనిషి అని, అందుకే చాలా మంది ఇష్టపడతారని అన్నారు.
Salman Khan Marriage…
తన జీవితంలోకి వచ్చే మహిళ తన కుటుంబాన్ని తన తల్లిలా చూసుకుంటుందా అని తాను ఎప్పుడూ ఆలోచిస్తానని, తన తల్లిలాంటి గుణాలున్న మహిళ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. తన భార్య కూడా తన తల్లిలాగే భర్తకు, పిల్లలకు అంకితమివ్వాలని, వంట చేయడం, ఇంటిపనులు చేయడం, కుటుంబం చేసే ప్రతి పనిలో సహాయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ రోజుల్లో అలాంటి మహిళలు రావడం అంత తేలిక కాదని, అందుకే సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదని సలీమ్ వీడియోలో వివరించాడు.
Also Read : Kalki 2898 AD Collections : భారీగా వసూళ్ల మోత మోగిస్తున్న ‘కల్కి2898 ఏడి’