Salman Khan : సడన్ గా హైదరాబాద్ ఫలక్ నామా ప్యాలెస్ లో ల్యాండ్ అయిన సల్మాన్

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్‌ ఏ. ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’...

Hello Telugu - Salman Khan

Salman Khan : బాలీవుడ్ ‘భాయ్’ సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇటీవల సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యానంతరం సల్మాన్‌(Salman Khan)కు బెదిరింపులు ఎక్కువైనా విషయం తెలిసిందే. ఒక దిక్కు ఆయన కట్టదిట్టమైన భద్రతతోనే పలు షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. తాజాగా సల్మాన్(Salman Khan) హైదరాబాద్‌లోని ఫలక్‌నామ ప్యాలెస్‌లో ల్యాండ్ అయ్యారు. హఠాత్తుగా ‘భాయ్’ హైదరాబాద్‌లో ల్యాండ్ కావడానికి కారణమేంటంటే..

Salman Khan in…

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్‌ ఏ. ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరేవేగంగా సాగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని ఫలక్‌నామ ప్యాలెస్‌లో షూట్ చేస్తున్నారు. ఈ మేరకే సల్మాన్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇక ఈ మూవీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పటిలానే మురుగదాస్ సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్‌ కానుకగా 2025లో విడుదల చేయనున్నారు.

ఇక బాబా సిద్ధిఖీ హత్యానంతరం బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ఆకతాయిలు డబ్బును సంపాదించేందుకు సల్మాన్‌ని టార్గెట్ చేస్తూ.. పోలీసులకు ఫేక్ మెసేజులు పంపిస్తున్నారు. సున్నితమైన ఇష్యూ కావడంతో పోలీసులు కూడా సీరియస్‌గానే ఈ మెసేజ్ లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇటీవల రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తాం అని వచ్చిన మెసేజ్ ని విచారణ జరిపిన పోలీసులు.. జంషెడ్‌పూర్‌లో కూరగాయల వ్యాపారం చేసే 24 ఏళ్ల యువకుడు ఈ మెసేజ్ చేసినట్లు నిర్దారించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆ యువకుడు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు రూ. 2 కోట్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ మరో మెసేజ్ సెండ్ చేయడంతో పోలీసులు ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Also Read : Chaitu Sobhita Wedding : అక్కినేని నాగచైతన్య, శోభితల వివాహ వెన్యూ పై కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com