Sikandar : పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహింస్తున్న సికందర్(Sikandar) మూవీకి సంబంధించి న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు సల్మాన్ ఖాన్ , రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్. ఈ పోస్టర్ మరింత అంచనాలు పెంచేలా చేసింది. టేకింగ్ లో మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు దర్శకుడు. తను దళపతి విజయ్ తో తీసిన సర్కార్ కోట్లు కుమ్మరించింది. ప్రజాస్వామ్యాన్ని, ఓటు విలువను దీని ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సందేశం ఉండేలా చూస్తాడు.
Slaman Sikandar Poster Sensational..
దీంతో తాజాగా తను కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో మూవీ చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే తన మార్కెట్ వాల్యూ ఏకంగా రూ. 1000 కోట్లకు పైగానే ఉంది. ఖాన్ ల త్రయం ఇంకా బాలీవుడ్ ను డామినేట్ చేస్తూ వస్తోంది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 1000 కోట్లను దాటేసింది. ఇందులో బాద్ షా షారుక్ ఖాన్ , దీపికా పదుకొనేతో తీశాడు. ఇది వసూళ్లను తిరగ రాసింది.
కథాంశాన్ని చాలావరకు గోప్యంగా ఉంచినప్పటికీ, చిత్రం నుండి ప్రతి రివీల్ ఉత్సాహాన్ని రేకెత్తించింది. టైగర్ 3 తర్వాత సల్మాన్ పెద్ద తెరపైకి తిరిగి రావడాన్ని సికందర్ సూచిస్తుంది, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఎదురు చూస్తున్న విడుదలలలో ఒకటిగా నిలిచింది.
గతంలో ఏఆర్ మురుగదాస్ గజిని తీశాడు. ఇక సంతోష్ నారాయణన్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చింది. యాక్షన్-ప్యాక్డ్ విజువల్స్‌కు ఇది సంపూర్ణంగా పూరకంగా ఉంది.
Also Read : Buchi Babu Shocking :కసితో తీస్తున్నా సినిమా సక్సెస్ పక్కా