Sikandar : తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సికందర్(Sikandar). ఇందులో కీలక పాత్రలు పోషించారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా. మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కథా పరంగా చూస్తే అణగారిన వర్గాల రక్షకుడిగా గౌరవించబడే శక్తివంతమైన నాయకుడి పాత్ర పోషించాడు సల్మాన్ ఖాన్. ఇక సాయిశ్రీ పాత్రలో నటించింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రతీకార కథ రాజ్ కోట్ నుండి ముంబైకి మారుతుంది.
Sikandar Movie Shocking Updates
ఏఆర్ మురుగదాస్ తనదైన టేకింగ్, మేకింగ్ తో ఆకట్టుకునేలా తీశాడు సికిందర్ ను. ఇది పూర్తిగా సల్మాన్ ఖాన్ అభిమానుల కోసం తయారైన చిత్రంగా చెప్పవచ్చు. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా తీశాడు దర్శకుడు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. గతంలో డైరెక్టర్ అమీర్ ఖాన్ తో 2008లో గజిని తీశాడు. 2014లో హాలిడే ను తెరకెక్కించాడు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మురుగదాస్ సల్మాన్ ఖాన్, రష్మికతో సికందర్ తీశాడు.
యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పూర్తిగా హీరో ఓరియంటెడ్ మూవీగా తీయడంలో సక్సెస్ అయ్యాడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు. తనకు ఇచ్చిన పాత్రలో లీనమై పోయాడు హీరో. ఇక సినిమాకు హైలెట్ గా నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. బాహుబలి మూవీలో కట్టప్ప పాత్రలో ఆకట్టుకున్న సత్య రాజ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. శర్మన్ జోషి, అంజిని ధావన్, కాజల్ అగర్వాల్ కూడా ఇందులో కీలకమైన పాత్రలు పోషించారు. మొత్తంగా ఇది సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు దర్శకుడని చెప్పక తప్పదు.
Also Read : Jagga Reddy- Popular Leader :మాస్ లీడర్ గా జగ్గారెడ్డి మూవీ