Salman Khan: యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంతో సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘టైగర్ 3’. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ అపియరెన్స్ లో నటించిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. సల్మాన్ ఖాన్(Salman Khan) కెరీర్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని ఆశించినప్పటికీ అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. విడుదలైన రెండు రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసినప్పటికీ… ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో రూ 400 కోట్ల దగ్గరే వసూళ్ళు ఆగిపోయినట్లు బిటౌన్ వర్గాల సమాచారం.
Salman Khan – డిసెంబరు 12న స్ట్రీమింగ్ కానున్న ‘టైగర్ 3’ ?
అయితే హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘టైగర్ 3’ భారీ అంచనాల కారణంగా… దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పోటీ పడి మరీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అందుకు అనుగుణంగానే సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకున్నారు. అయితే ‘టైగర్ 3’ మూవీకి థియేటర్లలో నిరాశ ఎదురు కావడంతో ఓటీటీలోకి త్వరగానే తీసుకు రావాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే అంటే డిసెంబర్ 12వ తేదీనే స్ట్రీమింగ్‌కు తీసుకు రావడానికి సన్నాహాలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో రెండు మూడు రోజుల్లోనే రాబోతుందని బీ టౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read : Hero Nithin: హీరోతో పోటీకు సై అంటున్న అసిస్టెంట్ డైరెక్టర్