Salman Khan: సల్మాన్ ఇంటి ముందు కాల్పులు ! జరిపింది మేమే అంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ !

సల్మాన్ ఇంటి ముందు కాల్పులు ! జరిపింది మేమే అంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ !

Hello Telugu - Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటిముందు కాల్పులు కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటికే ఆయనకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ టాప్‌ టెన్‌ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్‌ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Salman Khan – కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్‌ ఖాన్‌ కు బిష్ణోయ్‌ గ్యాంగ్ వార్నింగ్‌ ?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్(Salman Khan) ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్‌ 14) ఉదయం కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి… సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్‌ బుక్‌​ అకౌంట్​ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్​ మాత్రమేనని అందులో ఉంది. ‘ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్‌ రీచ్‌ అవుతాం.’ అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక ‍స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ తో గొడవేంటి ?

ఈ గ్యాంగ్‌స్టర్స్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్‌ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్‌ ఢిల్లీ జైలులో ఉన్నాడు.

Also Read : Raghava Lawrence: విజయ్‌ కి అభినందనలు తెలిపిన లారెన్స్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com