Salman Khan: ఈ ఏడాది ఏప్రిల్ లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన షూటర్లలో ఒకరైన విక్కీ కుమార్ గుప్తా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను పేద కుటుంబానికి చెందిన వాడినని, బీహార్‌లోని మారుమూల గ్రామంలో నివసిస్తున్నానని, అప్పుల్లో ఉన్నానని తన బెయిల్ పిటిషన్ లో గుప్తా పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉంది.
Salman Khan…
ఏప్రిల్ 14 ఉదయం బైక్ పై వచ్చిన వ్యక్తులు గుప్తా మరియు సాగర్ పాల్ బాంద్రాలోని సల్మాన్ ఖాన్(Salman Khan) గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆపై సాగర్ పాల్ రిమాండ్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్టాడు. ఈ కేసులో తొలుత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, కీలక ముఠా సభ్యుడు రోహిత్ గోధరాలను ఈ కేసులో వాంటెడ్ నిందితులుగా గత నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ముంబై పోలీసులు పేర్కొన్నారు.
అయితే కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరును తప్పుగా చేర్చారని, ముంబై పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా కాల్పుల్లో అతని పాత్ర లేదని నిందితుడు విక్కీకుమార్ గుప్తా పేర్కొన్నాడు. తాను కేవలం తనకు తానుగా సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు పిటిషన్ లో పేర్కొన్నాడు. కృష్ణజింకలను చంపిన సల్మాన్ ఖాన్(Salman Khan) ని భయపెట్టడమే లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు గుప్తా వెల్లడించాడు. ముంబై కోర్ట్ లో సోమవారం గుప్తా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగగా.. ఆగస్ట్ 13 కు తీర్పు ను వాయిదా వేశారు..
ఇదిలాఉండగా.. 1998లో రాజస్థాన్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో భక్తితో పూజించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపినా ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఈ కారణంగా అతనిపై ఎటాక్ కు చేసెందుకు పలువురు సిద్దమయ్యారు. లారెన్స్ బిష్ణొయ్ అయితే సల్మాన్‌ను చంపటమే తన జీవితాశయంగా కూడా పేర్కొన్నాడు. మరోపక్క కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌లోని ఓ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించగా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Also Read : Kamal Haasan: అభిమానులకు షాక్ ఇచ్చిన కమల్ హాసన్ !