Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు

దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...

Hello Telugu - Salman Khan

Salman Khan : బాలీవుడ్ ‘భాయ్ జాన్’ సల్మాన్ ఇంటికి భద్రత పెంచారు. ఇప్పటికే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు, బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్(Salman Khan) ముంబైలోని నివాసం గ్యాలక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఓ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Salman Khan Security

అయితేకృష్ణ జింకని వేటాడిన కేసులో కోర్ట్ సల్మాన్ ఖాన్‌కి ఉపశమనం ఇచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు. బిష్ణోయ్ లకు ఎంతో పవిత్రమైన కృష్ణ జింక ను వేటాడినందుకు సల్మాన్‌ని వదిలే ప్రసక్తే లేదని బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడో స్టేట్మెంట్ కూడా విడుదల కూడా చేసింది. ఇటీవల సల్మాన్ ఆప్త మిత్రుడు బాబా సిద్దిఖీ‌ని హతమార్చి నెక్ట్స్ నువ్వే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే గతంలోనూ సల్మాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. గత ఏడాది జూన్‌లో ఇంటి నుంచి పనేవాల్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కి వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిపారు. అప్పటికి సల్మాన్ అక్కడ నుంచి బయలుదేరటంతో ఎవరికీ ఏ ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని మాత్రం పోలీసులు ఈరోజు హర్యానాలో పట్టుకున్నారు. ఆ వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన సుక్ఖా‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సులభంగా ఆ వ్యక్తిని పట్టుకోగలిగారు.

మరోవైపుసల్మాన్‌ ఖాన్‌ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Nayanthara : అగ్ర నటి ‘నయనతార’ కు చంద్రముఖి నిర్మాత నోటీసులు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com