Salmaan Khan : టాప్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం సికిందర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే సికందర్ ను మార్చి 21న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఏమైందో కానీ సినిమాను రిలీజ్ చేయడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
Salmaan Khan Movie Updates
సల్మాన్(Salmaan Khan), రష్మిక చిత్రాన్ని మార్చి 30న ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు , ఈ అసౌకర్యానికి మన్నించాలని కోరారు మూవీ మేకర్స్. ఇంకో వైపు టైగర్ 3 కూడా సండే రోజు విడుదల కానుండడం విశేషం. ఈ మూవీలో సల్మాన్, రష్మికతో పాటు మరో బ్యూటీ కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ చిత్రం
సాధారణ శుక్రవారం ట్రెండ్‌ను బద్దలు కొడుతూ సండే ప్రేక్షకుల ముందుకు రానుంది. డైనమిక్ డైరెక్టర్ మురుగదాస్ చాన్నాళ్ల తర్వాత హిందీ మూవీ చేస్తుండడం విశేషం.
దీంతో అంచనాలు మరింత పెరిగాయి. తను గతంలో అమీర్ ఖాన్ తో గజిని చేశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సికందర్ పై భారీ నమ్మకం పెట్టుకున్నాడు హీరో సల్మాన్ ఖాన్. ఇక రష్మిక మందన్నా గత ఏడాదితో పాటు ఈఏడాది కూడా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. తను నటించిన పుష్ప2 బిగ్ సక్సెస్ అయ్యింది. ఏకంగా దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఛావా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది.
Also Read : స్వర ప్రపంచం ఇళయరాజా అద్భుతం